Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు
బ్రేకింగ్ న్యూస్

వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

02:30 మధ్యాహ్నం PM

పాడి పంటలు సమృద్ధిగా పండాలని.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు

దేవరకొండ, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుతూ పాత్లావత్ తండా (పి) గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తండాకు చెందిన గిరిజనులంతా ఒకే వేదికపైకి చేరుకుని ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి, బొడ్రాయి, వరుణ దేవునికి గ్రామ బావోజీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామదేవతలకు నైవేద్యాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాత్లావత్ (పి) తండా మాజీ సర్పంచ్ పాతావత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. విత్తనాలు వేసి రైతులు వరుణ దేవుని కరుణ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో పంట నష్టంతో రైతులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి రైతులను, ప్రజలను చల్లగా చూడాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాబూజీ వాంకునావత్ సోమ్లా, గ్రామ సర్పంచ్ భారతి ధర్మానాయక్, కాలియా సోమ్లా, చందు, బుజ్జి, దేవి, శాలి చక్రి తదితరులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ | The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 105🔗 Shares: 5👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *