Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › వాన హోరును మించిన భక్తి జోరు.. తల్లాడలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
తెలంగాణ

వాన హోరును మించిన భక్తి జోరు.. తల్లాడలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

03:43 మధ్యాహ్నం PM

ఎడతెరిపి లేని వర్షంలోనూ కొనసాగిన గణపతి వేడుకలు

శ్రీనగర్ కాలనీలో కలశయాత్ర.. ఆకట్టుకున్న కోలాటాలు, భక్తి నృత్యాలు

అన్నారుగూడెం, పినపాకలో ఘనంగా అన్నదాన కార్యక్రమాలు

తల్లాడ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ తల్లాడ మండలంలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. కలశ ఊరేగింపులు, కోలాటాలు, భక్తి నృత్యాలు, అన్నదాన కార్యక్రమాలతో పలు ప్రాంతాల్లో సందడి నెలకొంది.

శ్రీనగర్ కాలనీలో కలశయాత్ర

తల్లాడ మండల కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన కలశయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరికే నాగేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన ఊరేగింపులో మహిళలు, చిన్నారులు, యువతులు పవిత్ర కలశాలను ధరించి పాల్గొన్నారు.

వర్షం కురుస్తున్నప్పటికీ మహిళలు, యువతులు ప్రదర్శించిన కోలాటాలు, భక్తి నృత్యాలు, తీన్మార్ దరువులు ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీ నిర్వాహకులు గురివిందల సుధా నాయుడు, కోడూరి రాము, ఆపతి రామారావు, సీహెచ్ కృష్ణమూర్తి, పసుమర్తి శ్రీనివాసరావు, యూత్ కమిటీ ప్రతినిధులు, వర్తకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నారుగూడెంలో అన్నదానం

అన్నారుగూడెం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా గణపతి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు, గ్రామ సీనియర్ నాయకులు బొమ్మగాని నాదం, సెక్రటరీ కె. వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు బండి నరసింహారావు, దొడ్డ నరేష్, ఢిల్లీ, సాయి తదితరులు పాల్గొని భక్తులకు సేవలందించారు.

పినపాకలో మహా అన్నదానం

పినపాక గ్రామంలో సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగునూరు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్, నాయకులు వెంకటనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వర్షంలోనూ కొనసాగిన భక్తి సందడి

రోజంతా వర్షం కురుస్తున్నప్పటికీ తల్లాడ మండలంలోని పలు ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాల సందడి కొనసాగింది. కలశయాత్రలు, కోలాటాలు, నృత్యాలు, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ నిమజ్జన ఏర్పాట్లతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్షం మధ్య కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 46🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
22 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App