Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › తాజా వార్తలు › విద్యార్థులు హంతకులు కావడం సమాజంలో ఆందోళన కలిగిస్తుంది
తాజా వార్తలు

విద్యార్థులు హంతకులు కావడం సమాజంలో ఆందోళన కలిగిస్తుంది

10:06 రాత్రి PM

ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా దేవరకొండలో ఎస్‌ఎఫ్‌ఐ క్యాండిల్ ర్యాలీ

దేవరకొండ, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: కొండమల్లేపల్లి ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య ఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థులు హంతకులుగా మారడం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్త క్యాండిల్ ర్యాలీలో భాగంగా దేవరకొండ పట్టణ కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.

రూపా రెడ్డి హత్య అత్యంత విషాదకరమైన ఘటన అని, ఇలాంటి సంఘటనలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని నాయకులు అన్నారు. విద్యార్థుల్లో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతిక బాధ్యతలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మృతురాలి కుటుంబ సభ్యులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొని రూపా రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *