దేవరకొండ, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
వృద్ధులను ఆదరించి, వారికి అండగా నిలవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య పిలుపునిచ్చారు. లయన్ కర్నాటి పురుషోత్తం–రాజ్యలక్ష్మి దంపతులు తమ కుమార్తె తన్మయి జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం దేవరకొండ పట్టణంలోని మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమానికి 25 లీటర్ల గీజర్‌ను బహూకరించారు.
ఈ సందర్భంగా గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, తన్మయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలను నాలుగు గోడల మధ్య జరుపుకోవడానికే పరిమితం కాకుండా, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే వస్తువులను అందించడం గొప్ప విషయమని, ఆశ్రమానికి అందజేసిన గీజర్ వృద్ధ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా కర్నాటి పురుషోత్తం–రాజ్యలక్ష్మి దంపతులను లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, గాజుల రాజేష్, వనం శ్రీనివాసులు, జల్లా భాస్కర్, దినేష్, వృద్ధాశ్రమ అధ్యక్షురాలు గాజుల యాదమ్మ, సముద్రాల జయ ప్రభాకర్, గుడుగుంట్ల హేమలత, గోవిందు జగతయ్య, పద్మజ, మేనేజర్ పగిడిమర్రి జానకి, ఆశ్రమంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply