సీపీఐ నాయకుడు పల్ల రంగారెడ్డి
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
వెంకటమ్మ మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని పడమటిపల్లి సీపీఐ నాయకుడు పల్ల రంగారెడ్డి అన్నారు. వెంకటమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తూ, “మీకు ఎర్రజెండా అండగా ఉంది” అనే భరోసా కల్పించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. వెంకటమ్మ కుటుంబానికి అందించిన ఆర్థిక సహాయం ఆ బాధ్యతలో ఒక చిన్న అడుగు మాత్రమేనన్నారు.
ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలిచే సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ వారికి తోడుగా నిలుస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply