Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించాలి: నాగిళ్ళ ఆంజనేయులు● ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా: ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి● ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించాలి: నాగిళ్ళ ఆంజనేయులు● ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా: ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి● ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట
Home › బ్రేకింగ్ న్యూస్ › వెళ్లి రావయ్యా బొజ్జ గణపయ్య…
బ్రేకింగ్ న్యూస్

వెళ్లి రావయ్యా బొజ్జ గణపయ్య…

01:39 మధ్యాహ్నం PM

ఇంటిలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం నిర్వహించిన అమర్నాథ్ కుటుంబ సభ్యులు

దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:

వినాయక చవితి సందర్భంగా ఇంటిలో ప్రతిష్ఠించిన వినాయకుడికి నాలుగు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం గురువారం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో కోయల్‌కార్ రమేష్–యశోద దంపతుల గృహంలో ప్రతిష్ఠించిన చిన్ని గణపయ్యకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి కుమారుడు అమర్నాథ్ దంపతులు కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఆటపాటలు, సందడి మధ్య వినాయకుడిని ఊరేగిస్తూ భీమనపల్లి చెరువుకు చేరుకుని నిమజ్జనం నిర్వహించారు. ఉమ్మడి కుటుంబ సభ్యులంతా కలిసి కోలాహలంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడంతో కాలనీవాసులు సైతం ఆసక్తిగా తిలకించి కుటుంబ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తమ కుటుంబ సభ్యులంతా కలిసి విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు, చిన్నారులతో ఆనందంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 129🔗 Shares: 6👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App