నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు
శాంతిగూడెం, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శాంతిగూడెం సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డిని సోమవారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సన్మాన సభ నిర్వహించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, నూతన గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా ఇందిరా భాస్కర్ రెడ్డి ఎన్నికై పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. అనంతరం రెండో పర్యాయం సర్పంచ్‌గా చింతలపూడి భాస్కర్ రెడ్డిని గెలిపించుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై స్పందించే స్వభావం, పట్టుదలతో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పాటు నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు కావడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామ సర్పంచ్‌కు జిల్లా స్థాయిలో బాధ్యతలు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు.
చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది శాంతిగూడెం ప్రజలేనని తెలిపారు. రెండు పర్యాయాలు సర్పంచ్‌గా అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, శాంతిగూడెంను ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొని భాస్కర్ రెడ్డిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.









Leave a Reply