Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › శిల్పకళా విగ్రహాలను పార్కులో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరిన కౌన్సిలర్
బ్రేకింగ్ న్యూస్

శిల్పకళా విగ్రహాలను పార్కులో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరిన కౌన్సిలర్

04:33 సాయంత్రం PM

చారిత్రక శిల్పకళా సంపదను పరిరక్షించి పూర్వ వైభవం తీసుకురావాలి: కేతావత్ రూప్ల నాయక్

దేవరకొండ, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: దేవరకొండ ఖిల్లా దుర్గానికి సంబంధించిన చారిత్రక శిల్పకళా సంపదను పరిరక్షించాలని కోరుతూ 16వ వార్డు కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ను కోరారు.

దేవరకొండ ఖిల్లా దుర్గంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన శిల్పకళా విగ్రహాలను గతంలో భద్రపరిచే ఉద్దేశంతో తోపు ఫిరంగి ఎమ్మార్వో కార్యాలయంలో ఉంచారని కౌన్సిలర్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ విగ్రహాల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో వాటి రూపం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

పార్కులో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

చారిత్రక శిల్పకళా సంపదను కాపాడుతూ వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని, అనంతరం దేవరకొండ ఖిల్లా దుర్గంలోని పార్కులో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ కలెక్టర్‌ను కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విగ్రహాలను రక్షించి, వాటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

స్పందించిన కలెక్టర్

కౌన్సిలర్ విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.

కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో కౌన్సిలర్ కేతావత్ రూప్ల నాయక్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

అయుష్ 24 న్యూస్ 📰

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 67🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *