అర్హులైన ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 6, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దసరా, దీపావళి పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకం కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ.1,10,250 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.
దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా కొనియాడారు. సింగరేణి అనేది కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని పేర్కొన్నారు.
భూగర్భంలో అహోరాత్రులు శ్రమిస్తూ దేశానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల కృషి వెలకట్టలేనిదని వివరించారు.
గతేడాది చెల్లించిన రూ.1,03,000తో పోలిస్తే ఈసారి బోనస్ మొత్తాన్ని రూ.1,10,250కు పెంచినట్లు తెలిపారు.
సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.60,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.










Leave a Reply