ఎల్ఐసీ వ్యాపార అభివృద్ధిపై గంటకు పైగా సుదీర్ఘ చర్చ
దేవరకొండ, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): దేవరకొండ ఎల్ఐసీ బ్రాంచ్‌ను సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా బ్లియాజ్ (బీఎంఎస్) నాయకుడు, బ్రాంచ్ ప్రెసిడెంట్ ఇమ్మడి భద్రయ్య ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దేవరకొండ ఎల్ఐసీ బ్రాంచ్ వ్యాపార అభివృద్ధిపై ప్రభాత్ కుమార్ సాహు, ఇమ్మడి భద్రయ్యతో గంటకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. బ్రాంచ్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఏజెంట్లు కృషి చేయాలని, ఎల్ఐసీ సేవలను మరింత మంది ప్రజలకు చేరువ చేసేందుకు అనుసరించాల్సిన విధానాలు, నూతన పాలసీలపై చర్చించారు.
దేవరకొండ బ్రాంచ్ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని, మంచి ఫలితాలు సాధిస్తున్న బ్రాంచ్‌లలో దేవరకొండ ఒకటిగా నిలుస్తోందని ప్రభాత్ కుమార్ సాహు పేర్కొన్నారు. ఈ విజయానికి అధికారులు, సిబ్బంది, ఏజెంట్ల సమిష్టి కృషే కారణమన్నారు. ప్రతి ఏజెంట్ నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని ఎల్ఐసీ అభివృద్ధితో పాటు వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ ప్రెసిడెంట్ కె. బుచ్చిరెడ్డి, జోనల్ నాయకుడు ఎ. శ్రీనయ్య, డివిజనల్ నాయకులు వై. వెంకట్ రెడ్డి, సీహెచ్. రంగయ్య తదితరులు ప్రభాత్ కుమార్ సాహును మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
సీఎల్ఐఏ మేనేజర్ ప్రభాకర్, దేవరకొండ బీఎంఆర్ శివకృష్ణ, మాల్ మేనేజర్ అరుణ్ నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.









Leave a Reply