సీరత్-ఉన్-నబీ జల్సా నేపథ్యంలో పారిశుధ్య పనులు చేపట్టాలి
మున్సిపల్ కమిషనర్‌కు ఈద్గా, మక్కా మస్జీద్ కమిటీ వినతి
దేవరకొండ, అక్టోబర్ 27
( ఆయుష్ 24న్యూస్)
దేవరకొండ పట్టణంలోని మస్జిద్-ఎ-అఖ్సా, మిస్బా ఉల్ మదర్సా, దర్గా-ఎ-హజ్రత్ సయ్యద్ సులేమాన్ షా వలి దర్గా వద్ద ఈ నెల 31న నిర్వహించనున్న 36వ సీరత్-ఉన్-నబీ జల్సా ( సామూహిక వివాహాలు) సందర్భంగా పారిశుధ్య పనులు చేపట్టాలని ఈద్గా, మక్కా మస్జీద్ కమిటీ సభ్యులు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.జల్సాకు ముస్లింలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, మస్జిద్, మదర్సా పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం తొలగించి, పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిదంగా పార్కింగ్ పరిసరాల్లో శానిటేషన్ చేయాలనీ కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో హాఫిజ్ యండి హబీబొద్దీన్, యండి ఇలియాస్ పటేల్, యం ఏ ఖదీర్ సాలర్, మౌలానా అలీమోద్దీన్, యండి సలీమ్, ఖాజా మైనొద్దీన్, సయ్యద్ దస్తగిర్ ఎస్ కే ఇల్యాస్ బాబా, యండి షకీల్, యండి బాబా ఎంఏ ఖాలిక్, తదితరులు పాల్గొన్నారు









Leave a Reply