రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన
మంథని, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని మంథని విద్యార్థి సంఘం నాయకుడు బెజ్జంకి డిగంబర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ, నిరసన కార్యక్రమం సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమని డిగంబర్ విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థల స్వతంత్రత పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని బెజ్జంకి డిగంబర్ పేర్కొన్నారు.










Leave a Reply