భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 29 (AYUSH24 News ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశంతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు.
సిరిసిల్ల బైపాస్ రోడ్డు సమీపంలోని మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తూ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అంశాలను సమీక్షించారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply