Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ‘వంటా వార్పు’
బ్రేకింగ్ న్యూస్

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ‘వంటా వార్పు’

11:11 ఉదయం AM

ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

ప్రభుత్వ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వంటా వార్పు’ నిరసన కార్యక్రమాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డా. ఏఎస్ రావు నగర్, వంపుగూడ, మల్లాపూర్ (అశోక్ నగర్), నాచారం (హెచ్‌ఎంటీ నగర్), రామంతాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 7🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *