అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టిన మంథని యువకెరటం
10 ఓవర్లలో 48 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించిన ఖాజా మజహరుద్దీన్
సొంతూరు మంథనికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యమంటున్న యువ క్రికెటర్
మంథని, అక్టోబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి తాటి సత్యనారాయణ గౌడ్:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్డే లీగ్‌లో పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
మంథని పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఏరియా ప్రాంతానికి చెందిన ఖాజా మజహరుద్దీన్, ఎలిగెంట్ జట్టు తరఫున మారేడ్‌పల్లి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు.
10 ఓవర్లలో ఐదు వికెట్లు
ఈ మ్యాచ్‌లో ఖాజా మజహరుద్దీన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి, ఒక మెయిడెన్ ఓవర్‌తో పాటు కేవలం 48 పరుగులు ఇచ్చి ఐదు కీలక వికెట్లు సాధించాడు.
ఖాజా మజహరుద్దీన్ బౌలింగ్ ప్రదర్శన
10
ఓవర్లు
1
మెయిడెన్
48
పరుగులు
5
వికెట్లు
అతని బౌలింగ్ ప్రదర్శన స్థానిక క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది.
హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ
ఖాజా మజహరుద్దీన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీ కోఆప్షన్ సభ్యుడిగా, రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన, ప్రస్తుతం టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మహమ్మద్ జమీల్ అహ్మద్ తనయుడు.
ప్రస్తుతం ఖాజా హైదరాబాద్‌లో క్రికెట్ కోచ్ సలాం బయాష్ వద్ద శిక్షణ పొందుతూ తన క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నాడు.
మంథనికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యం
ఈ సందర్భంగా యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ మాట్లాడుతూ, క్రికెట్లో మరింత రాణించి ఉన్నత స్థాయికి ఎదగడమే తన లక్ష్యమని తెలిపాడు.
తన ప్రతిభతో సొంతూరు మంథనికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు.
యువ క్రికెటర్‌కు అభినందనలు
హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో ఖాజా మజహరుద్దీన్ ఐదు వికెట్లు సాధించడంపై మంథని ప్రాంత సీనియర్ క్రికెటర్ మహావాది సతీష్,తోపాటు స్థానిక క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి మంథని ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ యువ క్రికెటర్‌ను అభినందించారు.










Leave a Reply