రూ.450 కోట్ల పెట్టుబడి.. మూడేళ్లలో 1,000 మందితో బృందం విస్తరణ
హైదరాబాద్: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
ప్రముఖ బీ2బీ క్యాష్ జనరేషన్ ప్లాట్ఫామ్ బిల్ట్రస్ట్ హైదరాబాద్లో తన నూతన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. మాదాపూర్లోని రహేజా మైండ్స్పేస్లో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సంస్థ వచ్చే మూడేళ్లలో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు హైదరాబాద్లో తన బృందాన్ని 1,000 మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్న నైపుణ్యం కలిగిన టెక్నాలజీ మానవ వనరులను ఉపయోగించుకోవాలని బిల్ట్రస్ట్ ప్రతినిధులకు సూచించారు. సంస్థ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. టీ-హబ్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు.
బిల్ట్రస్ట్ హైదరాబాద్ కేంద్రం ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి, ఆపరేషన్స్ విభాగాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది. ఆరు నెలల్లోనే హైదరాబాద్లో 100 మందితో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. కొత్త కార్యాలయంలో ప్రస్తుతం 250 మంది వరకు పనిచేసే సామర్థ్యం ఉంది.
బిల్ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,600 బీ2బీ సరఫరాదారులకు సేవలు అందిస్తుండగా, సంస్థ ప్లాట్ఫామ్ ద్వారా ఏటా ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా ట్రేడ్ క్రెడిట్ వాల్యూమ్ ప్రాసెస్ అవుతున్నట్లు సంస్థ తెలిపింది.
కార్యక్రమంలో బిల్ట్రస్ట్ సీఈవో గ్రాంట్ హల్లరాన్, ఇండియా జీసీసీ కంట్రీ హెడ్ ఫర్హాద్ హెచ్. బారియా, సంస్థ గ్లోబల్ లీడర్షిప్ బృందం పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply