రవాణా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆకాంక్ష
పెద్దపల్లి, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
పెద్దపల్లి జిల్లా రవాణా కార్యాలయంలో నూతనంగా జిల్లా రవాణా అధికారి (DTO)గా బాధ్యతలు స్వీకరించిన దేవునూరి శ్రీనివాస్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా DTO దేవునూరి శ్రీనివాస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా రవాణా వ్యవస్థను మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేరుగు చందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మేరుగు సతీష్ గౌడ్, జిల్లా జాయింట్ సెక్రటరీ కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఫరీద్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు వెంగళ కృష్ణతో పాటు నాయకులు ధారా మధు, గుండేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply