📰 వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ
దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ మున్సిపాలిటీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది వెంకటేష్ గౌడ్‌ను ఆశీర్వదించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. తన కుటుంబం ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిండి మండల తహసీల్దార్ హన్మంత్ శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
— AYUSH 24 NEWS
The Voice of Truth

