Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి
బ్రేకింగ్ న్యూస్

🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి

03:05 మధ్యాహ్నం PM

పట్టణంలో వందకు పైగా వినాయక మండపాలు.. ఏర్పాట్లలో నిర్వాహకులు

దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:

ఆది గురువు, విఘ్నేశ్వరుడి పూజతో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వినాయక చవితి పండుగకు దేవరకొండ పట్టణంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని 20 వార్డుల్లో వందకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు మండపాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

విఘ్నాలను తొలగించి విద్య, జ్ఞానం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలను ప్రసాదించే బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

వినాయక చవితి అంటే చిన్నారుల్లో ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. ఇప్పటికే పలు మండపాల వద్ద యువత భజనలు, కీర్తనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండపం వద్ద భక్తి వాతావరణం నెలకొనేలా నిర్వాహకులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

భద్రతపై ప్రత్యేక దృష్టి

వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ అలంకరణలు, షార్ట్ సర్క్యూట్‌ వంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే గాలి, వర్షం వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తులు, నిర్వాహకులు సమన్వయంతో నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 386🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App