పర్యావరణ పరిరక్షణకు సందేశమిస్తూ మట్టి గణపతిని ప్రతిష్ఠించిన మున్సిపల్ చైర్పర్సన్
దేవరకొండ, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
దేవరకొండ పట్టణంలోని ఐబీ వెనుక ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు నివాస ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడు సోమవారం నుంచి భక్తుల పూజలు అందుకుంటున్నారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ద్వారా మున్సిపల్ చైర్పర్సన్ ఆదర్శంగా నిలిచారని పలువురు పట్టణ ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పున్న శైలజ మాట్లాడుతూ.. రసాయన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ముందుకు రావాలని సూచించారు.

ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, రసాయన రహిత వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతోనే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు తెలిపారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కాలనీవాసుల దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, కాలనీవాసులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply