ఆదేశాలు ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా: దేవరకొండ మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి
దేవరకొండ, అక్టోబర్ 1, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న దేవరకొండ పట్టణ పరిధిలోని చికెన్, మటన్, చేపలు, ఇతర మాంసాహార విక్రయ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి తెలిపారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జీవహింస నివారణ, అహింసా సూత్రాల పాటింపు దృష్ట్యా మున్సిపల్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ పరిధిలోని చికెన్, మటన్, చేపలు, ఇతర మాంసాహార విక్రయ దుకాణాలన్నింటినీ తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
పట్టణంలోని చికెన్, మటన్, ఫిష్, ఇతర నాన్వెజ్ దుకాణాల యజమానులు ఈ ఆదేశాలను పాటిస్తూ అక్టోబర్ 2న మాంసాహార విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు సంబంధిత మున్సిపల్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రామదుర్గారెడ్డి తెలిపారు.









Leave a Reply