Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తెలంగాణ › అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ మడత రమేష్
తెలంగాణ

అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ మడత రమేష్

05:25 సాయంత్రం PM

అనుమానం ఉంటే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలి
సప్తగిరి కాలనీలో కార్డెన్ సెర్చ్ — సరైన పత్రాలు లేని 15 వాహనాలు పోలీస్ స్టేషన్‌కు తరలింపు

గోదావరిఖని, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. సప్తగిరి కాలనీలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమాజ సంబంధాల కార్యక్రమంలో ఆయన పాల్గొని కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు.

కార్డెన్ సెర్చ్‌లో భాగంగా కాలనీలోని ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు మాదకద్రవ్యాల గుర్తింపు కుక్కలతో తనిఖీలు నిర్వహించారు. 65 ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, 6 ఆటోలను తనిఖీ చేసి ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని ఏసీపీ సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాలు లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని, సమాచారదాతల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలను పరిశీలించి నమోదు చేసుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని ఏసీపీ మడత రమేష్ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, కార్పొరేటర్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 18🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App