దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అతి త్వరలోనే స్టేడియాల నిర్మాణం చేపడతామని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు వెల్లడించారు.
ఈ సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT గారు కూడా క్రీడల అభివృద్ధి, యువతకు మెరుగైన క్రీడా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు, క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా దేవరకొండ నియోజకవర్గాన్ని క్రీడారంగంలో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
స్టేడియాల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు క్రీడల్లో రాణించే అవకాశాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక క్రీడాకారులకు శిక్షణ, పోటీల నిర్వహణకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది.
ఎమ్మెల్యే బాలు నాయక్ గారి ప్రకటనతో దేవరకొండ ప్రాంత యువత, క్రీడాకారుల్లో నూతన ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో స్టేడియాల నిర్మాణం కార్యరూపం దాల్చితే క్రీడారంగ అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
Ayush 24 News
అతి త్వరలో దేవరకొండలో స్టేడియాల నిర్మాణం చేపడతాం: ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అతి త్వరలోనే స్టేడియాల నిర్మాణం చేపడతామని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు వెల్లడించారు. ఈ సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT గారు కూడా క్రీడల అభివృద్ధి, యువతకు మెరుగైన క్రీడా సదుపాయాల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply