Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో చిరంజీవికి ఘన సత్కారం
బ్రేకింగ్ న్యూస్

అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో చిరంజీవికి ఘన సత్కారం

06:52 ఉదయం AM

మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

హైదరాబాద్, అయుష్ 24 న్యూస్: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆదివారం రాత్రి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌లను తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాదవరాయుడుపాలెం తాజా మాజీ సర్పంచ్ అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో అభిమానులు ఘనంగా సత్కరించారు.

కడియం ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన భారీ గజమాలతో చిరంజీవిని అభిమానులు ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ సమయంలో జరిగిన పలు విషయాలను చిరంజీవి, చంటి గుర్తు చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చంటికి రాజమహేంద్రవరం రూరల్ టికెట్ దాదాపుగా ఖరారైనప్పటికీ చివరి సమయంలో అవకాశం చేజారిన విషయాన్ని వారు గుర్తుచేసుకున్నారు.

తమ స్వగ్రామానికి ఒకసారి రావాలని అన్నందేవుల చంటి ఈ సందర్భంగా చిరంజీవిని కోరారు. తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన వరికంకుల కుచ్చును చిరంజీవికి అందజేశారు.

చంటి చేపడుతున్న ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర స్థాయిలో లభించిన గుర్తింపు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చంటి అందుకున్న అవార్డు వివరాలను చిరంజీవి ఆసక్తిగా పరిశీలించారు.

అన్నందేవుల చంటి, ఆయన తనయుడు అన్నందేవుల మణీంద్రలు జిల్లా నుంచి వచ్చిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్, శ్రీకాంత్, రాజా రవీంద్ర, చలమలశెట్టి సునీల్, గోపీ సోదరులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులతో సుమారు అరగంట పాటు ఆప్యాయంగా గడిపారు.

ఈ కార్యక్రమంలో జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ పాలపర్తి ప్రకాష్, కడియపులంక సొసైటీ మాజీ అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీను, మెగా ఇంజనీరింగ్ సంస్థ జనరల్ మేనేజర్ అన్నందేవుల సతీష్, ఎన్నారై నామన హరికృష్ణ, ఉండమట్ల దుర్గాప్రసాద్, కసిరెడ్డి కేశవ, అన్నందేవుల పెద్దబాబు, యార్లగడ్డ నాగన్న తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు పేర్కొన్నారు.

అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *