Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › మంథని › అవగాహన లేని మాటలు మానుకోవాలి: పుట్ట మధుకు కాంగ్రెస్ నేతల హితవు
మంథని

అవగాహన లేని మాటలు మానుకోవాలి: పుట్ట మధుకు కాంగ్రెస్ నేతల హితవు

11:17 ఉదయం AM

మంథని అభివృద్ధిపై విమర్శలకు కాంగ్రెస్ నేతల కౌంటర్ — మంత్రి శ్రీధర్ బాబుపై ఆరోపణలను ఖండించిన నాయకులు

మంథని, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అవగాహన లేకుండా విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు. మంథని పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్‌లో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలీ ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి మాట్లాడుతూ, శనివారం మార్కెట్ ప్రాంగణంలో పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలో కమిషన్ రాజకీయాలు, ఇసుక దందాలు చేశారని పుట్ట మధుకర్‌పై ఆరోపించిన వారు, ఇప్పుడు మంథని అభివృద్ధి, ప్రజలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

పుట్ట మధుకర్ తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే పదేపదే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని గతంలో పలుమార్లు సూచించినప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రావడం లేదన్నారు.

మంథని ప్రాంతాన్ని విద్య, వైద్యం, ఉపాధి సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అలాంటి నాయకుడిని ఏకవచనంతో సంబోధిస్తూ, ఆయన కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొన్ని సందర్భాల్లో ఆలస్యం జరగవచ్చని, అందుకు గల కారణాలను తెలుసుకున్న తర్వాతే బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబుకు మంథని ప్రాంత అభివృద్ధిపై పట్టింపు లేదని చెప్పడం సరికాదని పేర్కొన్నారు.

మంథని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన ఆసుపత్రి, కొత్త మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, అడవి సోమన్‌పల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. వాటిని పరిశీలిస్తే అభివృద్ధిపై అవగాహన వస్తుందని పేర్కొన్నారు.

దుద్దిళ్ల కుటుంబంపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంథని ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముసుకుల సురేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు మంథని సత్యం, కౌన్సిలర్లు ఎల్లంకి శివ, ఎరుకల స్రవంతి, జంబోలు సమ్మయ్య, మారుపాక నిహారిక, కుర్ర లింగయ్య, కాంగ్రెస్ నాయకులు శశి భూషణ్ కాచే, కొట్టే కిషన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కొత్త శ్రీనివాస్, గౌతమేశ్వర దేవాలయ చైర్మన్ గూండారాజు, ఎరుకల ప్రవీణ్తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 10🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App