Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రూ.16 వేల కోట్లకు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష● దేవరకొండ మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● రేపటి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన షెడ్యూల్ దేవరకొండ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● రూ.16 వేల కోట్లకు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష● దేవరకొండ మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● రేపటి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన షెడ్యూల్ దేవరకొండ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్
Home › తాజా వార్తలు › ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
తాజా వార్తలు

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

04:29 సాయంత్రం PM

విజయ భవన్‌లో మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి

హైదరాబాద్ | AYUSH24 NEWS

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లాలాపేటలోని విజయ భవన్‌లో ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు, ఎం.డి. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, IAS గారితో కలిసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేయడంలో ఆచార్య జయశంకర్ గారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడైన ఆచార్య జయశంకర్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

— AYUSH24 NEWS

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
683 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App