Saturday, 31 Oct 2026
31 Oct 2026Saturday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నల్గొండ వైద్య శాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం● ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!● పెగల్లపాడులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కోరం సురేందర్● ప్రపంచ రెజ్లింగ్‌లో చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. భారత్‌కు చారిత్రాత్మక స్వర్ణం● ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్● వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ● గ్రామాల సమగ్రాభివృద్ధితోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారం: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్● గుజరాత్‌లో రూ.14 వేల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం● నల్గొండ వైద్య శాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం● ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!● పెగల్లపాడులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కోరం సురేందర్● ప్రపంచ రెజ్లింగ్‌లో చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. భారత్‌కు చారిత్రాత్మక స్వర్ణం● ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్● వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ● గ్రామాల సమగ్రాభివృద్ధితోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారం: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్● గుజరాత్‌లో రూ.14 వేల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
Home › బ్రేకింగ్ న్యూస్ › ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!
బ్రేకింగ్ న్యూస్

ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!

నేరడుగొమ్ము ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): నేరడుగొమ్ము మండల విద్యాశాఖలో మండల విద్యాధికారి తాటికొండ బ్రహ్మచారి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుల శ్రీనివాస్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మండల ఉపాధ్యాయ వర్గాలు ఐక్యంగా స్పందించాయి.ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వారిద్దరికీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.మండలంలోని అన్ని యాజమాన్యాల

04:07 తెల్లవారుజాము AM

నేరడుగొమ్ము ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
నేరడుగొమ్ము మండల విద్యాశాఖలో మండల విద్యాధికారి తాటికొండ బ్రహ్మచారి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుల శ్రీనివాస్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మండల ఉపాధ్యాయ వర్గాలు ఐక్యంగా స్పందించాయి.ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వారిద్దరికీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏకగ్రీవంగా తీర్మానం చేయగా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు సైతం తమ మద్దతును ప్రకటించడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సన్మానం సమిష్టి నిర్ణయం..వ్యక్తిగత బాధ్యత కాదు!మండల విద్యాధికారి తాటికొండ బ్రహ్మచారి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించాలనే నిర్ణయం మండలంలోని ప్రధానోపాధ్యాయులందరి సమిష్టి అభిప్రాయంతో తీసుకున్నదని ఐక్య ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుల శ్రీనివాస్‌కు వ్యక్తిగత బాధ్యతను ఆపాదించడం సరికాదన్నారు. ఎవరినీ బలవంతంగా డబ్బులు ఇవ్వాలని కోరలేదని, ప్రధానోపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని పేర్కొన్నారు.అందరి సమష్టి నిర్ణయాన్ని వక్రీకరించి వ్యక్తులపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.35 ఏళ్ల విద్యాసేవకు సముచిత గౌరవం,తాటికొండ బ్రహ్మచారి సుమారు 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా,విద్యాధికారిగా విద్యారంగానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన అనుభవజ్ఞుడైన విద్యావేత్త పదవీ విరమణ సందర్భంగా సన్మానించుకోవడం ఉపాధ్యాయుల బాధ్యతగా భావిస్తున్నామన్నారు.సుదీర్ఘకాలం విద్యారంగానికి అంకితభావంతో సేవలందించిన వారి అనుభవానికి,కృషికి గౌరవం ఇవ్వడం మంచి సాంప్రదాయమని అభిప్రాయపడ్డారు.ఇలాంటి గౌరవప్రదమైన కార్యక్రమాలను రాజకీయాలకు,వ్యక్తిగత వివాదాలకు ముడిపెట్టడం సమంజసం కాదని స్పష్టం చేశారు.వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ఎలా ప్రచురిస్తారు?సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా,వాస్తవాలను పూర్తిస్థాయిలో నిర్ధారించుకోకుండానే వార్తలు ప్రచురించడంపై ప్రధానోపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత సమావేశం నిర్వహణకు ముందే జరిగినట్లుగా వార్తలు ప్రచురించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని,అదే సమయంలో వార్తల ప్రచురణలో వాస్తవ నిర్ధారణ, నిష్పాక్షికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రచురితమైన వార్తలను పునఃపరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సంబంధిత పత్రికా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఆరోపణలతో తుల శ్రీనివాస్ మానసిక క్షోభకు గురయ్యారని,వ్యక్తుల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు.అన్ని ఉపాధ్యాయ సంఘాల సంపూర్ణ మద్దతు
మరోవైపు తాటికొండ బ్రహ్మచారి,తుల శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలను మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు సైతం తీవ్రంగా ఖండించాయి. వారిద్దరికీ సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.ఉపాధ్యాయుల గౌరవం,ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని,వాస్తవాలు నిర్ధారించకుండా నిరాధార ఆరోపణలు చేయడం తగదని స్పష్టం చేశాయి.మండలంలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించడం ద్వారా సహోద్యోగుల గౌరవం విషయంలో ఉపాధ్యాయుల ఐక్యతను చాటిచెప్పారు. వివాదాలను పెంచడం తమ ఉద్దేశం కాదని,వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం, విద్యారంగానికి సేవలందిస్తున్న వారి గౌరవాన్ని కాపాడటమే తమ లక్ష్యమని ఐక్య ప్రకటనలో స్పష్టం చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 1👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
27 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App