Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

11:03 ఉదయం AM

జాతీయ జెండా దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక: సయ్యద్ అజీముద్దీన్

అయుష్ 24 న్యూస్ | ఆగస్టు 15

ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గా కాంప్లెక్స్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీముద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఐక్యత, సమానత్వం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని, దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత విద్య, ఉపాధి, సాంకేతికతతో పాటు సామాజిక సేవా రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.

విభిన్న మతాలు, వర్గాలు, జాతులతో కూడిన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశ రక్షణ, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు ఎండి షబ్బీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఇలియాస్ పటేల్, మాజీ వైస్ చైర్మన్ ఎండి రహత్ అలీ, సయ్యద్ మాజీద్ మౌలానా, ఎండి ఖదీర్ (సాలార్), ఎండి సలీం, సయ్యద్ దస్తగీర్, ఎస్‌కే ఇలియాస్ బాబా, కౌన్సిలర్ ఎస్‌కే నవీద్, ఎండి షబ్బీర్, ఎండి ముజీబ్, సయ్యద్ న్యామత్ షా, ఎండి షకిల్, ఎండి హమీద్, డాక్టర్ జహంగీర్, ఎండి సులేమాన్, గయాసోద్దీన్, అలీ మొద్దీన్, ఎండి షరీఫ్, ఎండి అజ్మత్, మోయిన్ పాషా, ఎండి జాకీర్, ఎండి మంజూర్, ఇక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *