వేలంపాటలో సంయుక్తంగా దక్కించుకున్న ముగ్గురు మిత్రులు
దేవరకొండ, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్లో ఈశ్వర పుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో 21 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి వద్ద ఉంచిన చిన్న లడ్డూకు ఆదివారం వేలంపాట నిర్వహించారు.
పోటాపోటీగా సాగిన వేలంపాటలో దేవరకొండ పట్టణానికి చెందిన ముగ్గురు మిత్రులు ఎన్. వంశీ (సిజ్జు), జి. రిషికేష్ (లక్కీ), డి. లోకేష్ సంయుక్తంగా రూ.1,11,116కు లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు ముగ్గురు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి లడ్డూను అందజేశారు.
లడ్డూను దక్కించుకున్న ముగ్గురు మిత్రులు మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రసాదం వేలంపాట ద్వారా తమకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఈశ్వర పుత్ర యూత్ అసోసియేషన్ కమిటీ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply