పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని ఎంటీవో (మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్) కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీల్లో భాగంగా కార్యాలయ పరిసరాలు, పోలీసు వాహనాల పార్కింగ్ ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌లను పరిశీలించారు. కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
విధుల్లో ఉన్న సిబ్బంది క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలీసు వాహనాల నిర్వహణ, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యాలయ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
పరిశుభ్రమైన, క్రమబద్ధమైన వాతావరణం పోలీసు సేవల నాణ్యత, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.










Leave a Reply