మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు అభినందనలు
దేవరకొండ: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
దేవరకొండ పట్టణానికి చెందిన నక్క నాగరాజు కుమార్తె నక్క వర్షిత ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 434 మార్కులు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందిన సందర్భంగా ఆమెను శనివారం చేనేత సహకార సంఘం మహాసభలో ఘనంగా సన్మానించారు.
మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు విద్యార్థిని వర్షితను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షిత ఎంబీబీఎస్ సీటు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. పద్మశాలీలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, కౌన్సిలర్లు, చేనేత సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply