రమావత్ నిఖితకు కళాశాలలో ఘన సన్మానం
దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్: దేవరకొండ పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో 2024–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థిని రమావత్ నిఖిత నీట్–2026 జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.బి. రమాదేవి తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కేశనేనిపల్లి గ్రామానికి చెందిన రామావత్ రాములు, సునీత దంపతుల కుమార్తె నిఖిత. నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
లక్షలాది మంది విద్యార్థులు పోటీపడే జాతీయ స్థాయి పరీక్షలో నిఖిత పట్టుదల, కృషితో విజయం సాధించిందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం కూడా ఆమె విజయానికి దోహదపడిందని పేర్కొన్నారు.

కష్టపడి చదివితే లక్ష్యాలను సాధించవచ్చని నిఖిత తన విజయంతో నిరూపించిందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నల్గొండ రీజినల్ కోఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాస్ రామ్, ప్రిన్సిపాల్ ఎస్.బి. రమాదేవి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నిఖితను కళాశాలలో సన్మానించి అభినందనలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply