సెప్టెంబర్ 3 సాయంత్రం 4:30 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలి
దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
దేవరకొండ పట్టణంలోని ఎం.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న హెల్త్ కేర్ అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎం.ఎస్సీ హెల్త్ కేర్‌లో పీజీ పూర్తి చేసి 55 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు.
పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలతో పాటు బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను 2026 సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 4:30 గంటల్లోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక వివరాలను అర్హత కలిగిన అభ్యర్థులకు చరవాణి ద్వారా తెలియజేస్తామని తెలిపారు.
మరిన్ని వివరాలకు: 📞 9912740993 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.



Musini.Anjan





Leave a Reply