అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టేకులపల్లి మండల కాంగ్రెస్ శ్రేణుల అభినందనలు
టేకులపల్లి, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇల్లందు నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్యను టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, గణేష్తో పాటు టేకులపల్లి మండలంలోని వివిధ గ్రామపంచాయతీల సర్పంచులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోరం కనకయ్యకు మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply