ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో లైట్ల ఏర్పాటు
రామగిరి: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో ప్రజల సౌకర్యార్థం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఐమాస్ లైట్లను ఏర్పాటు చేయించారు. గ్రామ సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ లైట్లతో రాత్రివేళ గ్రామంలో వెలుతురు మెరుగుపడడంతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తగ్గేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
గ్రామాన్ని మరింత సుందరంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రదీప్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్ | The Voice of Truth










Leave a Reply