శాంతిగూడెంలో గ్రామ, యూత్ కాంగ్రెస్, బూత్ కమిటీల ఎన్నిక
నూతన కమిటీ సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
డిండి, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు గ్రామస్థాయిలో పార్టీ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల శశిధర్ రెడ్డి సూచనలతో, గ్రామ సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో డిండి మండలం శాంతిగూడెంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, యూత్ కాంగ్రెస్ కమిటీ, బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందించారు.
పార్టీ బలోపేతానికి నూతన కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.










Leave a Reply