మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నాయకుల వెల్లడి
కాకర్లపల్లి: గ్రామంలోని విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో భాగంగా విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన 17 విద్యుత్ స్తంభాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు కాకర్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఈ విద్యుత్ స్తంభాలు మంజూరయ్యాయని వారు పేర్కొన్నారు. మంజూరైన విద్యుత్ స్తంభాలను కాకర్లపల్లి గ్రామానికి అందజేసినట్లు తెలిపారు.
గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఈ చర్య దోహదపడుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
17 విద్యుత్ స్తంభాలను మంజూరు చేసినందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కాకర్లపల్లి గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply