Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్
Home › బ్రేకింగ్ న్యూస్ › కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
బ్రేకింగ్ న్యూస్

కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

03:30 మధ్యాహ్నం PM

జమ్మికుంటకు చెందిన వేద పండితుడు బ్రహ్మశ్రీ మండలేముల శ్రీ కపర్తి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి:

వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

సోమవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలంతా తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.

జమ్మికుంట వేద పండితుడి ఆధ్వర్యంలో పూజలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన ఆస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ మండలేముల శ్రీ కపర్తి శర్మ (అయ్యగారు) సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.

వేద మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం.

AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 77🔗 Shares: 7👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
370 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App