నల్గొండలో మీడియా చిట్‌చాట్‌కు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నల్గొండ, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గమధ్యలో నల్గొండలోని వేడుక కన్వెన్షన్‌లో నిర్వహించిన జిల్లా మీడియా చిట్‌చాట్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ కేటీఆర్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కూడా వడ్త్య రమేష్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వడ్త్య రమేష్‌తో పాటు బీఆర్ఎస్ అజ్మాపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ, పెద్దతండా మాజీ సర్పంచ్ కాట్రావత్ వెంకటేష్ నాయక్, యువ నాయకులు కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply