దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
టీఎస్ యుటిఎఫ్ – ఎంజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ రచయిత, కవి, సంఘసంస్కర్త, ఉపాధ్యాయులు కొండ్రపల్లి శ్రీనును అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
స్థానిక విశ్వ మానవ భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గ్రంథాలయంలో, అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ డివిజన్ అధ్యక్షులు, దళిత రత్న ఎర్ర ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ్రపల్లి శ్రీనును శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సన్మాన గ్రహీత, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను మాట్లాడుతూ… విద్యార్థిని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు మరియు గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చడంతో పాటు, మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులకు, రాష్ట్ర కమిటీకి, మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందని, ఉపాధ్యాయ, విద్యార్థి లోకం సమస్యల పరిష్కారానికై ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో చందంపేట అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు నాగిళ్ళ వెంకటయ్య, జగదీష్, విజయ్ కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొని శ్రీనును అభినందించారు.
కొండ్రపల్లి శ్రీనుకు ఘన సన్మానం… ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రపల్లి శ్రీను
దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): టీఎస్ యుటిఎఫ్ - ఎంజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ రచయిత, కవి, సంఘసంస్కర్త, ఉపాధ్యాయులు కొండ్రపల్లి శ్రీనును అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక విశ్వ మానవ భారతరత్న


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply