అనువైన ప్రాంతాలను పరిశీలించిన పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష
పెద్దపల్లి, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అనువైన స్థలాలను పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష పరిశీలించారు.
పెద్దపల్లిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుటితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి, విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన స్థలాలపై పరిశీలన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో దాసరి ఉషతో పాటు బత్తుల రమేష్, ఈనాడు రాజేందర్, మెరుగు నరేష్, వేముల సందీప్, మాటేటి తిరుపతి, కన్నం శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply