లబ్ధిదారులకు కార్డులు అందజేసిన కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు
గంగాపురి | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు బుధవారం గంగాపురిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో గంగాపురి గ్రామ ప్రజలు, మహిళలు, స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
— AYUSH24 NEWS










Leave a Reply