కిహోన్, కటా, కుమిటేలో సాంకేతిక నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ
గజ్వేల్: కియో జపాన్ షోటోకాన్ కరాటే డో అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గజ్వేల్‌లో కలర్ బెల్ట్ విద్యార్థుల కోసం కరాటే శిక్షణ శిబిరం విజయవంతంగా నిర్వహించారు.

ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కిహోన్ (ప్రాథమిక కరాటే పద్ధతులు), కటా, కుమిటే అంశాల్లో క్రమబద్ధమైన శిక్షణ అందించారు. సరైన స్టాన్స్, శరీర కదలికలు, పంచింగ్, కికింగ్ టెక్నిక్స్, సమన్వయం, బ్యాలెన్స్, టైమింగ్, క్రమశిక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
అలాగే వివిధ కరాటే టెక్నిక్స్‌ను ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలి, సంప్రదాయ కరాటే విలువలను ఎలా పాటించాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు ఉన్నత స్థాయి శిక్షణతో పాటు భవిష్యత్ పోటీలకు సిద్ధం కావడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. కలర్ బెల్ట్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, అంకితభావంతో శిక్షణ పొందడంతో కార్యక్రమం విజయవంతమైంది.

కియో జపాన్ షోటోకాన్ కరాటే డో అసోసియేషన్ ఇండియా క్రమశిక్షణ, గౌరవం, వ్యక్తిత్వ వికాసం, శారీరక దారుఢ్యం, సాంకేతిక నైపుణ్యం వంటి విలువలను కరాటే శిక్షణ ద్వారా ప్రోత్సహిస్తోంది.
OSS… 🥋
అయుష్ 24 న్యూస్










Leave a Reply