పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు
మంథని, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం మంథని పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంథని పట్టణంలోని గణపతి దేవాలయం, స్వర్ణకారుల గణపతి, రెడ్డి సంఘ భవన్ గణపతి, మందాట యూత్ గణపతి, నడివీధి విఘ్నేశ్వర మండపాలను మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మంథని నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు ఆయా వినాయక మండపాలను సందర్శించిన సందర్భంగా నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply