జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో సర్పంచ్ దండేవేన సంధ్యా బానేష్
గుంజపడుగు, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గ్రామంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు మంచి పోషకాహారం అందించడం అవసరమని సర్పంచ్ దండేవేన సంధ్యా బానేష్ అన్నారు.
శనివారం నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రక్తహీనతను నివారించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, ప్రతి తల్లి తన పిల్లలకు సమతుల్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు వంటి పోషకాహారాన్ని అందుబాటులో ఉన్న మేరకు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొన్నారు.
తల్లి ఆరోగ్యంగా, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండేలా గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.
కార్యక్రమంలో సీడీపీఓ పుస్పలత, సూపర్వైజర్ సరిత, అంగన్వాడీ టీచర్లు బరిబద్దుల స్వరూప, మట్ట శారద, వంగళూరి కళావతి, అక్కపాక వరుణ, రమాదేవి, ఉప సర్పంచ్ ఎల్క లక్ష్మి, వార్డు సభ్యురాలు దేవుళ్ళ లక్ష్మీతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










Leave a Reply