Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తాజా వార్తలు › గిరిజన సంక్షేమ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
తాజా వార్తలు

గిరిజన సంక్షేమ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

08:36 ఉదయం AM

విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతపై ఆరా

మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశం

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.

ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్, హాస్టల్‌లోని విద్యార్థుల సంఖ్య, వారి హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెనూ చార్ట్‌ను పరిశీలించి కిచెన్, గోదాంలో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు.

మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయా లేదా పరిశీలించారు. అనంతరం విద్యార్థుల వసతి గదులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. హాస్టల్ ఆవరణతో పాటు వంటగది, వసతి గదుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులు హాస్టల్‌లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదువుతూ తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 35🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App