ప్రతి రైతు ఫార్మ్ పాండ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
మంథని, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో వీబీ-జీ రామ్ జీ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫార్మ్ పాండ్ పనులను సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తమ పంట పొలంలో ఫార్మ్ పాండ్ నిర్మించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను వినియోగించుకుని ఉపాధి పొందాలని కోరారు. జాబ్ కార్డు లేని అర్హులు దరఖాస్తు చేసుకుని త్వరగా కార్డు పొందాలని గ్రామస్తులకు సూచించారు.
వీబీ-జీ రామ్ జీ ద్వారా రూ.375 వరకు వేతనం పొందవచ్చని, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 125 రోజుల పని దినాలు లభిస్తాయని సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవి, వార్డు సభ్యురాలు సాదుల కళ్యాణి, మేట్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply