నల్గొండ జిల్లా సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
నల్గొండ జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన శాంతిగూడెం సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డిని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
డిండి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్న భాస్కర్ రెడ్డి తాజాగా నల్గొండ జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో చింతపల్లి మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు రామస్వామి, సర్పంచుల ఫోరం రాష్ట్ర గిరిజన నాయకుడు కొర్ర రాంసింగ్ నాయక్, పాతలావత్ తండా మాజీ సర్పంచ్ వాంకుడావత్ రాజ్‌కుమార్, శేషాయికుంట మాజీ సర్పంచ్ ఆంజనేయులు, కొట్టే అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply