సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సహాయం మంజూరు చేయించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని మండలం ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన మెరుగు రాజయ్య వైద్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరైనట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వైద్య ఖర్చులకు సహాయం కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన మంత్రి చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారని తెలిపారు. సంబంధిత ఎల్ఓసీ పత్రాలను హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు అందజేసినట్లు వెల్లడించారు.
వైద్య చికిత్సకు రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరుకు సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మెరుగు రాజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.










Leave a Reply