రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు
చిన్నహోదాల | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
చిన్నహోదాల గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు తాజాగా కార్డులు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి నాగుల శారద రాజయ్య మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు వీలుకలుగుతుందని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు సన్నబియ్యం అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. ఎన్నో రోజులుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు కార్డులు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు గ్రామ ప్రజలు, పాలకవర్గ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త రేషన్ కార్డులు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవసరమైన ముఖ్యమైన పత్రాల్లో ఒకటిగా ఉపయోగపడతాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి నాగుల శారద రాజయ్య, వార్డు సభ్యులు దువ్వాసి సదయ్య, వేముల సమత, మంథని లావణ్య, పల్లె హర్షణ, జీపీఓ నూకల శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply